
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 7 సెల్ 9550978955
మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు
చిలకలూరిపేట: పట్టణ పరిధిలోని ప్రజలందరూ తమ పన్నులను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు కోరారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, పన్నుల వసూళ్లపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 31వ తేదీలోగా ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లలో వేగం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పర్యటించి, నిర్దేశించిన గడువులోగా పన్నులు వసూలు చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, పట్టణంలోని వ్యాపార సంస్థల ట్రేడ్ లైసెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లకు సూచించారు.మార్చి 31వ తేదీలోగా బకాయిలుచెల్లించాలి,దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్నులను త్వరితగతిన కట్టాలని సూచన, వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశం.ప్రజలు తమ బాధ్యతగా పన్నులు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని, మొండి బకాయిదారులు కూడా వెంటనే చెల్లించాలని తెలిపారు.