
వున్న మహిళా మణులకు జోహార్లు..
జనం న్యూస్ మార్చ్ 9 ముమ్మిడివరం ప్రతినిధి
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదర మాట్లాడుతూఅనాది కాలం నుంచి వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు.. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారని, అన్ని రంగాల్లోనూ మగవాళ్ళతో సమానంగా పురుషుల కన్నా ఎన్నో రెట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాజానగరం నియోజకవర్గంలో మాజీ ఇంచార్జ్ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు. ఆదివారం రాజానగరం నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన కోరుకొండలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో చట్టసభల్లో మహిళలు తమ ప్రాతినిధ్యాన్ని సమర్థవంతంగా నిరూపించుకున్నారని, దేశ అభివృద్ధి లోనూ కీలకంగా ముందుకు సాగుతున్నారు. ఆకాశమంత సమున్నత వ్యక్తిత్వంతో.. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలలోనూ బలమైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారని వీరన్న చౌదరి పేర్కొన్నారు. రాష్ట్రాల అసెంబ్లీలలోనూ మహిళలు.. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలు అందించడం.. ఈ శతాబ్దపు చరిత్రలో అద్భుతమైన విజయమన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ మహిళలందరికీ వీరన్న చౌదరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
