
జనం న్యూస్ మార్చ్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి వారినిదర్శించుకోవడానికి విచ్చేసిన అన్నవరం దేవస్థానం ఈవో, రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథ్ ని, ఆలయ మర్యాదలతో దేవాలయం ఉత్సవ కమిటీ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు, అర్చకులు స్వాగతం పలికి, బేడా మండపం ప్రదక్షిణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు.. ఈ సందర్భంగా శ్రీనివాసరావు అతనిని సత్కరించారు ఈ కార్యక్రమంలో అర్చకులు పులకండం విజయబాబు పులకండం రాజేష్, జనసేన నాయకుడు, దేవాలయం మాజీ చైర్మన్ శ్రీరామదాసు గోవిందరావు పాల్గొన్నారు