
జనం న్యూస్. తర్లుపాడు మండలం మార్చి 9
తర్లుపాడు మండలం లో ని చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల లో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం స్టడీ హౌర్ లో శ్రీ సత్య సాయి సేవా సంస్థ, కంభం, మార్కాపూర్ జిల్లా శాఖ వారు పబ్లిక్ పరీక్ష మొదలయ్యేవరకు అల్పాహారం అందిస్తున్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు మాట్లాడుతూ సత్య సాయి సేవా సంస్థ కార్యక్రమంను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పాఠశాల కు, గ్రామానికి, మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటులో కృషి చేసిన ఆంగ్ల ఉపాధ్యాయులు పి. కోటి మోహన్ ని ఈ సందర్బంగా పాఠశాలప్రధానోపాధ్యాయులు బాలరాజు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. కార్యక్రమం లో జిల్లా గ్రామ సేవా కన్వీనర్ కే. బిక్షం, సత్య సాయి భజన మండలి చినమనగొండం కన్వీనర్ ఈర్ల బాల వెంకటేశ్వర్లు, సేవాదళ్ సభ్యులు వై.వెంకటేశ్వర్లు, జిల్లా పి.యస్. సతీష్ కుమార్, తర్లుపాడు మండల సత్య సాయి భజన మండలి కన్వీనర్ తుమ్మల పెంట సురేష్, మండల సాయి సేవా సమితి భవనం రామకృష్ణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పి. కోటిమోహన్, రవిస్ శేఖర్,నరసింహారావు, చంద్ర శేఖర రెడ్డి, రమేష్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
