
జనం న్యూస్ 09 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
పేరుగొప్ప .. ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్ర ఆస్పత్రి తీరు. విద్వద్ గద్వాలగా పేరుగాంచిన గద్వాల చరిత్రను మరోతరానికి తెలుపడానికి గద్వాల సంస్థానాదీశయులు, పోరాట యోధులు, కవులు, కళాకారులు, మహానీయులను గుర్తు తెచ్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న ప్రహారిగోడపై వారి చిత్రాలను చిత్రీకరించారు. కాని ప్రహారి గోడ ముండ్ల పొదలు , చెత్త పేరుకపోవడంతో మీదున్న మహానీయులు చిత్రాలు నామరూపంలేకుండా పోయాయి. చెత్తను కాని ముండ్ల పొదలను తొలగించేందుకు ఆసుపత్రి అధికారులు, మున్సిపల్ అధికారులు ఏమాత్రం ముందుకు రావడంలేదని ఆసుపత్రి రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో పరిసరాల పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గద్వాల ఆసుపత్రిని అభివృద్ది చేస్తారని ప్రజలు ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు..