
జనం న్యూస్ 09 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్ పరిశీలించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 05 అర్జీలను జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్ పరిశీలించారు.ఫిర్యాదు దారులతో జిల్లా అదనపు ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి వినతులను స్వీకరించి, సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో భూ వివాదాలకు సంబంధించి – 02, ప్లాట్లకు సంబంధించి – 01, డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని – 01, ఇతర అంశాలకు సంబంధించి – 01 ఫిర్యాదులు రావడం జరిగింది. పి ఆర్ ఓ జిల్లా పోలీస్ కార్యాలయం,
జోగుళాంబ గద్వాల్ జిల్లా.