
జనం న్యూస్ 10 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలి. బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య. ఈ సందర్బంగా గద్వాల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని పాఠకులతో కలిసి బాత్రూమ్స్ ముందు నిలబడి నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ…గ్రంథాలయంలో సమస్యలతో సతమతమవుతున్న పాఠకులు గతంలో చాలాసార్లు విన్నవించిన కూడా గ్రంధాలయాన్ని పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.జిల్లా కేంద్రానికి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పాఠకులు మారుమూల గ్రామాల నుంచి వస్తే ఇక్కడ పాటకులకు టాయిలెట్ పోయడానికి, లెట్రిన్ పోవడానికి బాత్రూంలు లేకపోవడం వలన పాఠకులకు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళ పాఠకులకు పూర్తి ఇబ్బందికరంగా ఉంది.అదేవిధంగా లైబ్రరీలో కల్పించాల్సినటువంటి మెటీరియల్ మరియు అప్డేట్ అయిన డీఎస్సీ మెటీరియల్ గ్రూప్స్ మెటీరియల్ లేకపోవడం పాఠకులకు చాలా ఇబ్బందికరంగా ఉంది.
వేసవికాలం కాబట్టి గ్రంథాలయంలోపల కూలర్స్ ఫ్యాన్స్ సదుపాయాలు కల్పించాలి.అదేవిధంగా గద్వాల జిల్లా కేంద్రంలో నడిబొడున పునాది లెవల్ నిర్మాణంలో ఉన్న గ్రంథాలయన్ని నిర్మించకుండగా మధ్యలోనే ఆపివేయడం అంటే ఈ జిల్లా యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే . పాలకులు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ బిల్డింగ్ ని పూర్తి చేసి ఈ జిల్లా యొక్క విద్యార్థులకు గ్రంథాలయ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు తక్షణమే జిల్లా కలెక్టర్ మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయాలని అని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠకులు మహేష్, బండారి అభిషేక్, మార్క్, నరేందర్, జహంగీర్, సతీష్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు