
జనం న్యూస్, మార్చి 10: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న శుక్రవారం దేవికి బోదేపెల్లి గ్రామ వాసి భక్తి శ్రద్ధలతో 50 గ్రాముల బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. ఈ గొలుసు విలువ సుమారు రూ. 8,25,000గా ఉందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దాతను ఘనంగా సన్మానించారు. గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని భక్తులు ప్రార్థించారు.