
జనం న్యూస్ :10 మార్చ్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
వివేకానంద పాఠశాలలో మంగళవారం రోజున మ్యాజిక్, మాట్లాడే బొమ్మ (వెంట్రిలోక్విజం) మరియు మిమిక్రీ ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు మిమిక్రీ రమేష్ విద్యార్థులకు వినోదంతో పాటు సందేశాత్మక ప్రదర్శన ఇచ్చారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యాల్ల .భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 64 కళల్లో మ్యాజిక్, మిమిక్రీ కూడా ఒక ముఖ్యమైన కళ అని, విద్యార్థులు చదువుతో పాటు కళలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.అనంతరం పాఠశాల యాజమాన్యం మిమిక్రీ రమేష్‌ను శాలువాతో సన్మానించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ లిఖిత, ఉపాధ్యాయునులు వాణీశ్రీ, రత్నమాల , కావేరి ,దేవిక భరతమాత,ఫిర్ద్దోజ్,మానుష విద్యార్థులు పాల్గొన్నారు.