
జనం న్యూస్ 10 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా అదనపు కలెక్టర్ కి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు డిసెంబర్ జనవరి నెలలకు సంబంధించిన 2 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నుండి వేతనాలు విడుదల ఐనప్పటికీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రతిసారి ఆలస్యంగా కార్మికులకు వేతనాలు అందజేస్తున్నారని తెలిపారు.ఇప్పటికీ కొన్ని మండలాల ఎంఈవోలు వర్క్ డన్ పంపలేదని, దీనివల్ల వేతనాల విడుదలకు మరింత ఆలస్యమవుతుందని అన్నారు.పాఠశాలలకు నిధులు విడుదల చేసినా, అక్కడ మహిళా సంఘాల వల్ల కూడా ఆలస్యం అవుతుందని తెలిపారు.ఇప్పటికే అదనపు పనిభారాలతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు ఇచ్చే అతి తక్కువ వేతనాలను సైతం నెలల తరబడి పెండింగ్ లో ఉంచడం సరైనది కాదన్నారు.తక్షణమే మండలాల ఎంఈఓ లను వర్క్ డౌన్ అందజేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని, వేతనాలు నెల నెల సక్రమంగా అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల సంఘం పట్టణ అధ్యక్షులు రఘు, కార్మికులు సంతోషమ్మ, మల్లమ్మ, శాంతమ్మ, జయమ్మ, మురళి, బాలరాజు, శ్రీనివాస్,గోవిందు తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదాలతో ఉప్పేర్ నరసింహ సీఐటీయు జిల్లా అధ్యక్షులు జోగులాంబ గద్వాల జిల్లా