
సారపాక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ వారి నిర్వహణ
సివిల్ సప్లై అధికారి పట్టీ పట్టనట్లు వ్యవహరించడం వల్ల వినియోగదారులకు దొరకని గ్యాస్
అనునిత్యం వినియోగదారుల వెన్నంటే అంటూ గొప్పలు చెప్పుకునే గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వాలు నేడు వారి వెన్ను విరుస్తున్నాయి. సబ్సిడీ అంటూ వారి రాబడికి మార్గాలు వెతుక్కుని సామాన్యులను మాత్రం దోపిడీకి గురి చేస్తున్నాయి. గృహిణుల జీవితాలలో వెలుగులు అంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు, గ్యాస్ యాజమాన్యాలు వినియోగదారులను నానా తిప్పలకు గురిచేస్తున్నారు. ఎకౌంట్లో డబ్బులు పడక, సమాధానాలు దొరకక, ఎవరికి ఫిర్యాదు చేయాలో వినియోగదారులు అయోమయానికి గురి అవుతున్నారు. నిత్యవసర వస్తువుగా మారిన గ్యాస్ ను పలు ఏజెన్సీలు అక్రమ మార్గాల ద్వారా అమ్ముకోవడంతో తాము బుక్ చేసుకున్నా గ్యాస్ తమకు సకాలంలో చేరడం లేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. కాల్ సెంటర్లకు ఫోన్ చేసినా సరైన సమాధానం దొరకట్లేదని, ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని, గ్యాస్ బండల కొరతను తమ గుండెలపై మోప వద్దని వినియోగదారులు ప్రభుత్వాలను, గ్యాస్ కంపెనీలను/ ఏజెన్సీలను కోరుకుంటున్నారు. సారబాక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ వారు పలు హోటలకు గృహ వినియోగదారులకు ఇవ్వాల్సిన గ్యాస్ లను పక్కదారి పట్టించడం వల్ల వినియోగదారులకు అందని గ్యాస్ అంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు.