
జనం న్యూస్ మార్చి(10) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల కేంద్రంలో మంగళవారం నాడు ఒకటవ రెండవ వార్డులలో నీటి కొరత ఉండడంతో వెంటనే స్పందించిన సర్పంచ్ మహేశ్వర్ మల్లికార్జున్ బోరు వేయించినాడు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు వేసవికాలంలో నీటి ఎద్దడి నివారించడానికి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగం సరిత వార్డు సభ్యులు ఉప్పల వీరు యాదవ్, దానబోయిన మంగమ్మ, గోవర్ధన్,మధుసూదన్ రెడ్డి, సురేందర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.