
జనం న్యూస్ మార్చ్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం నూ కాంబిక జాతర ఉత్సవాలను జయప్రదం చేయాలని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పిలా నాగ శ్రీను విజ్ఞప్తి చేశారు.. ఆలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు… ఈ నెల 17న నూకాంబిక అమ్మవారి జాతర 18న కొత్త అమావాస్య పండగతో పాటు 19న ఉగాది ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.. ఈ ఉత్సవాలు నెలరోజుల పాటు ఏప్రిల్ 17 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు..ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నెల రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు.. రాష్ట్ర పండగగా గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన దగ్గరుండి రెండవ ఎట ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు…రాష్ట్ర ప్రతినిధిగా జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లి రవీంద్ర అమ్మవారికి పట్టు వస్త్రాలను 18వ తేదీన సమర్పించడం జరుగుతుందన్నారు..ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. ఇప్పటికే తాటాకు పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు.. క్యూ లైన్లు ఏర్పాటు జరిగిందన్నారు అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట గడచిన ఎనిమిదో తేదీన జరిగిందని అప్పటినుండి అమ్మవారి మూల విరాట్ కు దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ భీమర శెట్టి రామ్ కి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇప్పటికే నెల పండుగ ఉత్సవాలపై ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు.. సాధారణ భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.. ఆలయానికి వచ్చే రోడ్లన్నీ మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు.. స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశామన్నారు విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగిందన్నారు.. ఆలయంతో పాటు వంద అడుగుల రాజగోపురం కూడా రంగులతో అలంకరించడం జరిగిందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు సుధారాణి, ఆలయ సహా కమిషనర్ యాళ్ళశ్రీధర్,ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు,కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు,యర్రవరపు సంతోషి కుమారినాగేష్, తదితరులు పాల్గొన్నారు.