
జనం న్యూస్ మార్చి 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
స్థానికంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ప్రశంసనీయమని దీనబంధు కాలనీ అధ్యక్షుడు మహేందర్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జగద్గిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్కు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు నిలబెట్టడంలో పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ తమ పరిసరాల్లో కనిపించే అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. పోలీసులు–ప్రజల మధ్య సమన్వయం పెరిగితే నేరాల నియంత్రణ సులభమవుతుందని, సమాజంలో శాంతి భద్రతలు మరింత బలపడతాయని మహేందర్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
