
ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రమేష్ సెట్
బిచ్కుంద మార్చి 11 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద లో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కే. అశోక్ అధ్యక్షత వహించగా, బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సీమ షెట్కర్ , వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి , మూడవ వార్డు కౌన్సిలర్ ధర్పల్లి కార్తిక మరియు మహిళా కౌన్సిలర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులందరూ సరస్వతీ పూజ, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా దినోత్సవ నేపథ్యంలో విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు. బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ మాట్లాడుతూ నేడు మహిళలు పురుషుల తో పోటీపడుతూ అవని నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రావీణ్యం ప్రదర్శిస్తున్నారని వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని అందుకు తగిన శ్రమ కృషితో మీ కల లను నెరవేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు . అనంతరం అధ్యాపక బృందం అతిథులను మరియు కళాశాల మహిళా ఉద్యోగులను శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో కళాశాల మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త వై.రేవతి కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

