
జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్ట్ వైద్యులు ఆర్ బి ఎస్ కే వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్స పొందాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా డీ.ఎమ్.ఎచ్.ఓ డాక్టర్ అప్పయ్య , మండల మెడికల్ ఆఫీసర్ సాయి కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి బుజ్జన్న రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.....