
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే సాయి మంత్ర పారాయణతో శ్రీ దత్త సాయికి పంచామృత అభిషేక కార్యక్రమం ఈ అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు జరిగినాయి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దత్త సాయి ని దర్శించి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కీర్తిశేషులు గద్దె అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని దత్త సాయి సన్నిధిలో జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి భక్తుల తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలని షిరిడి సాయి సూక్తిని ఆధారంగా చేసుకుని గత 14 సంవత్సరములుగా ప్రతి గురువారం క్రమం తప్పకుండా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని, ఏ భక్తులైతే 25 కేజీల బియ్యం ఇస్తారు వారి గోత్రనామాలతో మూడు నెలల పాటు ప్రతి గురువారం అన్న సందర్భంగా తెలియజేశారు, వచ్చే గురువారం ఉగాదిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆ రోజు పాల్గొని స్వామివారి రక్ష ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు అయినవోలు హనుమంతరావు, కొత్తూరు హనుమంతరావు మద్దుల ప్రసాదు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అన్నదాత తదితరులు పాల్గొన్నారు