
జనం న్యూస్ మార్చ్ 12 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన ,
ఈనెల 16వ తేదీన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాట్రేనికోన మండలంలో కంది కుప్ప, కాట్రేనికోన చెయ్యెరు, సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మండలంలో మొత్తం 55 5మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కందికుప్ప హైస్కూల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు . వరండా గదుల్లో కలిపి మొత్తం 11 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ కు ఎటువంటి తావు లేకుండా పరీక్షల నిర్వహణ జరుగుతుందని హెచ్ఎం జేబీ వి రమణ అన్నారు.