
జనం న్యూస్ 13 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
హైదరాబాదులో గాంధీ భవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఈ సందర్భంగా డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ మాట్లాడుతూ…తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు చేసిన కృషిలో దళితుల నుంచి యస్ సి విభాగం నాయకుల కృషి మరువలేనిది అని కొనియాడారు.గతంలో 2003 లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రావడానికి ఎలాగైతే దళితులు ముందు వరుసలో ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా రెప రేపాలడాలి అంటే దళితుల అవసరం ఎంతైనా ఉంటుంది అని కనుక మాదిగ మాల నాయకులు కార్యకర్తలను గుర్తించి వారికి గౌరవం ఇచ్చి బలంగా చేయవలసిన అవసరం ఉంది అని అన్నారు .కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి నిదర్శనమే ఈరోజు కవంపల్లి సత్యనారాయణ కి ఎస్సీ సెల్ విభాగా చైర్మన్గా అవకాశం కల్పించడం అని అన్నారు కొల్లంపల్లి సత్యనారాయణ యన్ యస్ యూ ఐ నుంచి నాకు మంచి మిత్రుడుగా ఉన్నారు అని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎన్ఎస్ఈఐ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారే అని చిన్న చిన్న విద్యార్థి విభాగం నాయకులను ఈరోజు పిసిసి అధ్యక్షులుగా ఎమ్మెల్యేలుగా ఏఐసీసీ కార్యదర్శిగా నియమించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని సంపత్ కుమార్ అన్నారు. దళితుల పక్షాన నాటి నుంచి నేటి వరకు నిలిచిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని దళితుల కోసం ఏదైనా పార్టీ ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని దళితులకు భూమిని ఇచ్చి దళితులు గౌరవంగా బతకాలని ఆలోచన చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు.గత పదివేల టిఆర్ఎస్ పాలనలో దళితులపై దాడులు లాకభ్యత్తులు చాలా జరిగాయని బి ఆర్ ఎస్ పార్టీ దళితుల్ని చాలా చిన్న చూపు చూసిందని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, టిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, లక్ష్మీ కాంత్, యెన్నం శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, మందుల సామెలు, కే ఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, దేవి రాజు, సిరిసిల్ల రాజయ్య, సతీష్ మాదిగ, కొండేటి మల్లన్న, నమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

