
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13. 03. 2026
ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ పాటిల్ తెలిపారు. రోజుకు పలుమార్లు కరెంటు పోవడంతో గృహ అవసరాలు, రైతుల వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయని అన్నారు. రాత్రి సమయంలో కూడా విద్యుత్ సరఫరా సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.