
జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
అంగన్వాడీ టీచర్స్, వీవోఏ లు అందరితో సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన మండల పరిషత్ ఆఫీసు నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 15.03.26 తేదిన జరుగు అక్షరాంధ్ర (ఉల్లాస్) అభ్యాసకులకు నిర్వహించే ఫైనల్ ఎగ్జామ్స్ లో తీసుకోవలసిన సూచనలు, విధి విధానాలు తెలియజేయడం జరిగింది. మరియు ఎగ్జామ్ మెటీరియల్ అందజేయడం జరిగింది.సదరు కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్ రావు, డిప్యూటీ ఎంపీడీఓ సూర్య నారాయణ రాజు, ఏపీఎం శ్రీనివాస్ రాజు, ఏపీవో చంద్రమోహన్, అంగన్వాడీ టీచర్స్, VOA's పాల్గొన్నారు…
