
జనం న్యూస్ మార్చి 12: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఐదు రోజులుగా కొనసాగిన వార్డు సభ్యులు, ఉపసర్పంచుల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. మండలంలోని ఎనిమిది గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు, ఉపసర్పంచులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఎంపీడీవో వెంకటేశ్వర్లు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శిక్షణ పొందిన ప్రతి వార్డు సభ్యుడు తమ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనర్లు శ్రీకాంత్, ప్రవీణ్, భరత్ స్వరూప్, సురేష్, ఉపసర్పంచులు ఆసిరెడ్డి హనుమంత్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మూడ్ దయానంద్, సున్నపు లక్ష్మి శ్రీనివాస్, బొల్లపల్లి సుమన్ గౌడ్, చాట్ల జనార్ధన్, లోపు రాజు, జాకీర్, పంచాయతీ కార్యదర్శులు జాకీర్, రామకృష్ణ, భోజన్న, ఆకుల రవి, గణేష్, అనిల్, సంధ్యారాణి, రాకేష్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
