
జనం న్యూస్ ;14 మార్చ్ శనివారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :సిద్దిపేట:
పదవ తరగతి బోర్డు పరీక్షలు రాయబోయే విద్యార్థులకు తెలుగు ఫ్యాకల్టీ చెల్లోజు.నాగరాజు ధైర్యం చెప్పారు. పరీక్షలు భయపడాల్సినవి కావని, విద్యార్థులు సంవత్సరం మొత్తం చదివిన విషయాలను ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు.ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి, సమయపాలనతో స్పష్టంగా సమాధానాలు రాయాలని ఆయన తెలిపారు. తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివే అలవాటు ఉంటే విజయం తప్పకుండా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు మరియు పాఠశాలకు గర్వకారణం కావాలని ఆకాంక్షించారు.చివరగా పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.