
జనంన్యూస్. 14.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం లో ఏఐపికెఎంఎస్ రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ను ఆవిష్కరిచి ఈ సందర్బంగా. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపికెఎంఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతు వ్యవసాయ కూలీలు, కార్మికులు అంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపు ఉంది అని, పూర్తిగా వ్యవసాయ కూలీలను విస్మరిస్తున్నాయి అన్నారు. వ్యవసాయ రంగం లో యాంత్రికరణ వల్ల కూలీలకు పని దొరకక పస్తులు ఉంటు అన్నామో రామ చంద్ర అంటు ఎదిరి చూస్తున్నారు . ప్రధాని మోడీ కూలీల పొట్ట కొట్టడానికె ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసారని, కూలీలు అంటేనే ప్రధాని మోడీకి చిన్నచూపు చూస్తూన్నారని అన్నారు. వికసిత్ భరత్ అంటున్నా ప్రధాని మోడీ వ్యవసాయ కూలీలకోసం ఏ ఒక్క పథకం చెపట్టిన దాకాల లేదు అన్నారు. తమ హక్కుల కోసం కూలీలు వీధుల్లోకి వచ్చి కొట్లాడాలని ఆయన పిలుపు ను ఇచ్చారు.కామారెడ్డి లో ఏఐపికెఎంఎస్ రాష్ట్ర మహాసభ.వ్యవసాయ కూలీలే కీలకంగా పని చేస్తున్న అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపికెఎంఎస్) తన తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలను మార్చ్ 24, 25 తేదిలల్లో నిర్వహించుకుంటున్నదని ఆయన తెలిపారు. ఇట్టి మహాసభలను 24నాడు కామారెడ్డి లోని విక్లీ మార్కెట్ లో జరిగే బహిరంగ సభలో ఇల్లందు లో 5సార్లు ఎం.ఎల్.ఏ. గా గెలిచినా మాజీ ఎం.ఎల్.ఏ గుమ్మడి నర్సయ్య ముఖ్యఅతిథి గా హాజరై ప్రారంభిస్తారన్నారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ లు ప్రసంగిస్తారు అన్నారు. రెండవ రోజు 25న, ప్రతినిధుల సభ మున్నూరు కాపు సంఘం కళ్యణమండపం లో జరగనున్నదని, ఇట్టి ప్రతినిధులసభను ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి పాపారావు ప్రారంభిస్తారు అన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పి విజయరామరాజు, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్ లు ప్రసంగిస్తరన్నారు అన్నారు. మహాసభ లలో జరిగిన కార్యక్రమాల రిపోర్ట్స్ పై రివ్యూ, భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించడం, నూతన కార్యవర్గం ఎంపిక ఉంటుంది అన్నారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఇ గంగాధర్, ఏఐపికెఎంఎస్. మండల నాయకులు కే రామన్న, గట్టు కిరణ్, జె రాజు, ఎస్.కె. రపిక్ , షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.