
జుక్కల్ మార్చ్ 14జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు..
ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా స్థిరమైన నివాసం కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని,ప్రతీ అర్హత కలిగిన పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదేనని పునరుద్ఘాటించారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్ జుక్కల్ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్ మాజీ సొసైటీ చైర్మన్ శివానంద్ జుక్కల్ మాజీ సర్పంచ్ రాములు సెట్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు..
