
జనం న్యూస్, మార్చి 14, 2026: అమలాపురం బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులై
మొదటిసారి అమలాపురం వచ్చిన సందర్భంగా వల్లూరి నానిని బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోనసీమ జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, భవిష్యత్ కార్యక్రమాలు వంటి ముఖ్యమైన అంశాలపై పరస్పరం చర్చించారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పనిచేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు