జనం న్యూస్ ఫిబ్రవరి 12 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో గలశ్రీశ్రీశ్రీ వెంకట నరసింహ స్వామి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బి.ఆర్.ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బుఖ్య జాన్సన్ నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ భక్తిని చాటుకున్నారు.తదానంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.