
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి16
తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల లో మరియు మోడల్ ప్రైమరీ పాఠశాల లోఆంధ్ర ప్రదేశ్ అవతరణ కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమర జీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి సందర్బంగా చెన్నారెడ్డి పల్లి గ్రామ నివాసి, మార్కాపురం నకు చెందిన బి.జె.పి మాజి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా ట్రెజరర్ బొంతల కృష్ణ, ధర్మ పత్ని కుసుమాంబ గారు వారి తల్లిదండ్రులు బొంతల చెంచయ్య, వెంకట సుబ్బమ్మ జ్ఞాపకార్ధం ఏర్పాటుచేసిన ఆదియోగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలకలు మరియు ప్యాడ్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో 6 నుండి 9వ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష అట్టలు బిస్కెట్లు పంపిణీ చేశారు.
బొంతల కృష్ణ వారి దంపతులను ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రవిశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం భారతి దేవి ఉపాధ్యాయ బృందం విడివిడిగా ఘనంగా సన్మానించారు.కార్యక్రమం ఏర్పాటు కు సహకరించిన ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు పెరుమాళ్ళ కోటి మోహన్ గారిని ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థులందరికి బిస్కెట్స్, స్వీట్స్ అందించారు. కార్యక్రమం లో ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రవిశేఖర్ రెడ్డి, నరసింహారావు, కోటి మోహన్, చంద్ర శేఖర్ రెడ్డి, రమేష్, కిషోర్, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి దేవి,సుభాషిణి, ఇందిర ప్రసన్న కుమారి, అంగన్వాడీ టీచర్స్ నాగమణి,, గ్రామ పెద్దలు పేరం లక్ష్మణరావు, రామారావు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు.
