
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 16
అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తేదీన గురవయ్య, మహాలక్ష్మి దంపతులకు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లె లో జన్మించారు. వారి పెద్దలంతా మద్రాసులో సెటిల్ అయ్యారు.ఆయన విద్యాభ్యాసము మద్రాసులోనే జరిగింది. ఆ తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీర్ పూర్తి చేసి అక్కడే గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో ఉద్యోగం సంపాదించారు. అక్కడ నాలుగేళ్లు ఉద్యోగం చేశారు అతని వివాహ అనంతరం ఒక బిడ్డ పుట్టి చనిపోయారు ఆ తర్వాత కొన్ని రోజులకు భార్య కూడా చనిపోయింది. 25 ఏళ్ల వయసులో ఆయనకు జీవితం మీద విరక్తి చెంది తనకున్న ఆస్తిపాస్తులను అన్నదమ్ములకు పనిచేసి అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ శిష్యుడిగా చేరాడు. తర్వాత 1930లో ఉప్పు సత్యాగ్రహం మరియు 1942లో సహాయం నిరాకరణ ఉద్యమం ఆ తర్వాత జరిగిన ఉద్యమాలు పాల్గొని మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు. 1943- 44 లో చరఖా ఉద్యమానికి కృషి చేశాడు. కులమతాలు పట్టింపు లేకుండా ఎవరింట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరులోని వేణుగోపాల్ స్వామి టెంపుల్ లో దళితులకు ప్రవేశం లేదని విషయం తెలుసుకుని ఉద్యమం చేసి సాధించారు. హరిజనుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. గాంధీజీకి పొట్టి శ్రీరాములు అంటే ఎంతో అభిమానం ఆయనకున్న మంకుతనం అంటే కొంచెం చిరాకు ఉన్నప్పటికీ,ఇలాంటి మొండితనం గల వాళ్లు పదిమంది ఉంటే స్వతంత్రం మనకు ఇంకా ముందే వచ్చేదని అంటుండేవారు. ఆ తర్వాత ఆంధ్రులను తమిళనాడు రాష్ట్రంలో చిన్నచూపు చూసి అవమానించడం గ్రహించి ఆయనకు బాధ కలిగి 1952 అక్టోబర్ 19వ తేదీన ఆయన స్నేహితుడైన బులుసు సాంబమూర్తి ఇంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. క్రమేనా ఆయన ఆరోగ్యం క్షీణించింది. చివరకు డిసెంబర్ 15 తేదీన అనారోగ్యంతో మరణించారు. 58 రోజుల దీక్ష చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయిన పొట్టి శ్రీరాములు గురించి ఆంధ్ర రాష్ట్రమంతా విషయం తెలిసి ఎన్నో గొడవలు ఉద్యమాలు జరిగాయి. అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కి విషయం తెలిసి త్వరగా ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగ ఫలితమే మన తెలుగు వారికి 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పడింది. అలాంటి గొప్ప మహనీయుని జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయులు జగన్ బాబు తెలియజేశారు. ఆయన త్యాగాలు విద్యార్థులకు తెలియజేస్తూ ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఎం అనూష గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
