
మద్నూర్ మార్చి 17 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని మద్నూర్ రైతు వేదిక యందు
ఆత్మ సౌజన్యంతో మద్నూర్ మండల రైతులకు ఆయిల్ పామ్ పంట మీద మరియు సేంద్రియ వ్యవసాయం మీద మండల వ్యవసాయ అధికారి రాజు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. సేంద్రియ వ్యవసాయము మీద మద్నూర్ గ్రామ రైతులకు అవగాహన కల్పించి125 మంది నుంచి సేకరించిన మట్టి నమూనా ఫలితాలను , మరియు మట్టి నమూనా కిట్లను రైతులకు ఇవ్వడం జరిగినది.రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడం ద్వారా భూమి సారవంతంగా ఉంటుంది అలాగే పురుగు , ఎరువుల వాడకం తగ్గియాలని సూచించడం జరిగింది ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు లాభదాయకం ఉందని, ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని రైతులు ఆయిల్ పామ్ పంటలను సాగు చేయాలని అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, ఉప సర్పంచ్ వట్నల్వర్ రమేష్ , మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు , ఉద్యాన అధికారి రామకృష్ణ, హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ మేనేజర్ మోహన్ జాదవ్, fpo చైర్మన్ గోపాల్ , ఏఈ వో లు , సౌమ్య, సరోజ, విశాల్, సంయుక్త మరియు రైతులు పాల్గొన్నారు
