
జనం న్యూస్ -మార్చి 17- నాగార్జునసాగర్ టౌన్-
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ 99 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నాగార్జునసాగర్ లోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్ పి ఎఫ్) ఆధ్వర్యంలో 10 కే రన్ నిర్వహించారు , ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డివి భాస్కరరావు, రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ప్రతాప్ నాయుడు ఆధ్వర్యంలోఎస్ పి ఎఫ్
డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా ఆదేశాల మేరకు నిర్వహించిన 10 కే రన్ కార్యక్రమాన్ని పైలాన్ పిల్లర్ వద్ద నుంచి లెఫ్ట్ ఎర్త్ డ్యాం చివరి వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 99 యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రతి వారం ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు దీనిలో భాగంగానే స్వచ్ఛభారత్ రక్తదాన శిబిరం ,అనాధ పిల్లలకు, పేదవారికి దుస్తులు పంపిణీ, ఆహార పదార్థాల అందజేత వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు అంతేకాక నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో నాగార్జున్ సాగర్ జెన్ కో ఎస్ పి ఎఫ్ విభాగం, సాగర్ ప్రాజెక్టు భద్రత విభాగం, మిర్యాలగూడ కు చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ, చెస్ట్ విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.