
జనం న్యూస్ 9/మార్చ్/2026 టేక్మాల్ రూరల్ రిపోర్టర్ కొండి. లక్ష్మణ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో మహిళలు వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ ఒకచోట చేరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారూ.సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ప్రతి రంగంలోనూ మహిళలు రాణించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు.అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురష్కరించుకొని టేక్మాల్ తహసీల్దార్ మరియు గ్రామ పంచాయతీ కార్యాలయము ఎల్లంపల్లి యందు ఎల్లంపల్లి సర్పంచ్ శ్రీమతి ఉప్పరి మమత మరియు వార్డు సభ్యరాలు కొండి రోజా, కిచ్చన్నపల్లి పెంటమ్మ ని శాలువాలతో సన్మానిoచడం జరిగింది.