
జనం న్యూస్ 18 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని మేడికొండ గ్రామంలో బుధవారం రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ సహకారంతో, ఐజ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడికొండ లక్ష్మీకాంత రావు నేతృత్వంలో ఈ పనులు నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ లైజమ్మ అశోక్ & ఉప సర్పంచ్ రాధా తిమ్మప్ప ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో అపరిశుభ్రత వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా మట్టి వేయించి శుభ్రపరిచారు. అదేవిధంగా గ్రామంలోని అన్ని వార్డుల్లో మట్టి రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తి చేశారు._
ఈ సందర్భంగా మేడికొండ లక్ష్మీకాంత రావు మాట్లాడుతూ..మేడికొండ గ్రామ అభివృద్ధికి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ సేవలు అమూల్యమైనవని తెలిపారు. గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వెంటనే స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న నాయకుడిగా ఆయన నిలుస్తున్నారని కొనియాడారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న సంపత్ కుమార్ గారు మేడికొండ గ్రామానికి మరింత అభివృద్ధి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆయన సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.