జనం న్యూస్, ఫిబ్రవరి 12 తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ప్రకృతి వ్యవసాయ విస్తరణ కొరకు డ్రోన్ సహాయంతో సాంకేతిక విధానంలో డ్రోన్ వరి పంటలపై రెండో విడత ప్రకృతి వ్యవసాయ కషాయాలను పిచికారి కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఇందులో భాగంగా బుధవారం పెరవలి మండలంలో గల ముక్కామల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ కషాయాలను ద్రావణాలను వరి పంటలపై 400 ఎకరాలకు పిచికారి చేయించడం కొరకు ప్రణాళిక పద్ధతిగా ముందుకు వెళుతున్నాము అని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సూర్యనారాయణ తెలిపారు. వరి పంటలపై పురుగులు తెగులు నియంత్రణ కొరకు వ్యాప గింజల ఇంగువ కషాయాలను చాప బెల్లం ద్రావణాన్ని డ్రోన్ సహాయంతో పిచికారీ చేయించినట్లు జిల్లా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ తెలిపారు.మొదటి విడతగా మండలంలో 1500 ఎకరాలలో ఈవిదంగా పిచికారీ చేసేవిదంగా ప్రణాళిక చేసినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. డ్రోన్స్ ద్వారా ఈకార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వెంకటకృష్ణ మాట్లాడుతూ వరి పంటలపై కాండం తొలిచేపురుగు రసం పీల్చే పురుగు మాగుడు మొదలగు తెగుళ్లను నియంత్రించడానికి ప్రకృతి వ్యవసాయ కషాయాలు పిచికారి చేయడం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వరి పంటలో వచ్చు తెగిళ్ళను నివారించడంలో వేప గింజల కషాయం ,చేపల బెల్లం ద్రావణం బ్రహ్మాస్త్రము, వావిలాకు కషాయాలను జీవామృతంతో కలిపి పంటలపై పిచికారి చేయడం వల్ల ఆశించిన దానికంటే అధిక దిగుబడిని పొందవచ్చని గ్రామ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వెంకటేశ్వర్లు, వెంకట కృష్ణ తెలియజేశారు. గ్రామంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణ కొరకు డ్రోన్ సహాయంతో కషాయాలను రైతుల్లోనికి నేరుగా తీసుకువెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు యూనిట్ ఇంచార్జ్ సూర్యనారాయణ తెలియజేశారు.ఈకార్యక్రమంలో సిబ్బంది సూర్యనారాయణ, రైతులు, వెంకటకృష్ణ, భవాని, జ్యోతి, కాపవరం, ప్రశాంతి, రుద్ర వెంకట రమణ, పాల్గొన్నారు