
జనం న్యూస్ ; 18 మార్చ్ బుధవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
తెలంగాణ అస్తిత్వం: ఉగాది పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్ధిపేటలో నేడు 'శ్రీ పరాభవ నామ ఉగాది' చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం, ఉగాది చిత్రాన్ని చిత్రించి లాంఛనంగా ఆవిష్కరించారు ముందుగా మాట్లాడుతూ అందరికి శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిజేస్తూ, పండుగలు సంస్కృతి సహజీవనశోభను పెంచి సమాజాలను కళావంతం చేస్తాయి. ప్రకృతి పరవశించి బీదవాని గుండెల్లో దిగులు దులుపే పరాభవ నామ సంవత్సరం "ఉగాది" పర్వదినం' వికారాలను తరుమ షడ్రుచుల పచ్చడి, నవధాన్యాలను ప్రకృతి ద్వారా మనకు కానుకగా తెచ్చే. పంచాంగ శ్రవణంతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకొనే విదంగా జాగృత పరుస్తుంది. "ఆగ మాగమై మూగ బోకు" కోకిల గానంలా దూసుకపో” ఆశయసాధనే ఉగాది మనకు" ప్రపంచం లో జరుగుతున్న దుర్మార్గములను ఎండగడుతూ నలువైపులా ఆరోగ్యం శాంతి భద్రతలు ఆనందాలు వెల్లివిరియాలని, కోట్ల గుండెల అమూల్య ఐకమత్య ఖజానా నాతెలంగాణ అస్తిత్వం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాల ఐకమత్యం, సంస్కృతి సంప్రదాయాలను రక్షిస్తూ ప్రజా సంక్షేమ పథకాల అమలు భారతావనికి కనువిప్పు కలగాలని పరాభవ నామ సంవత్సర ఉగాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఐక్యతకు నాందిపలకాలని మాన వతా చిత్రకారులు రుస్తుం తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబీనారుస్తుం, ఎండి సాధిక్ రహీం తదితరులు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిరి.