
బిచ్కుంద మార్చ్ 18 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో గల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో రైతులకు నానో ఎరువుల వాడకం మరియు వివిధ పంటలలో సస్యరక్షణ చర్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా రైతులకు సాంప్రదాయ రసాయన ఎరువులు అధిక మోతాదులో వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు వివరంగా తెలియజేయడం జరిగింది, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో ఎరువులు వాడుకోవాలని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పండిస్తున్న వివిధ పంటలలో ఆశించే చీడపీడలు, వాటి లక్షణాలు, అవి నష్ట పరిచే విధానాలు రైతులకు వివరిస్తూ వాటిని నివారించుకునేందుకు పాటించవలసిన సాంప్రదాయ మరియు రసాయన నివారణ చర్యలు వివరించడం జరిగింది. తర్వాత సమావేశానికి విచ్చేసిన IFFCO కంపెనీ ప్రతినిధి సతీష్ కుమార్ గారు నానో ఎరువుల యొక్క ప్రాముఖ్యత, నానో ఎరువులు వాడే విధానం, వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ గారు, ఉప సర్పంచ్ తుకారం గారు, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, IFFCO కంపెనీ ప్రతినిధి సతీష్ గారు, వ్యవసాయ విస్తరణ అధికారులు దయానంద్, శివలింగ్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు
