
జనం న్యూస్ మార్చి 19 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన విడుదల చేసిన సందేశంలో ఉగాది పండుగ సాంప్రదాయ, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని విశదీకరించారు.ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఆధారిత జీవన విధానంలో పరస్పర సహకారం, ప్రేమాభిమానాలతో జీవించే సబ్బండ వర్ణాలకు ఉగాది ఒక మహత్తర పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ప్రజల శ్రామిక, సాంస్కృతిక జీవితంలో ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు.చెట్లు పచ్చగా చిగురిస్తూ ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకునే ఈ కాలంలో, అదే ఉత్సాహం ప్రజల జీవితాల్లోనూ నిండాలని ఆయన ఆకాంక్షించారు. రైతులు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషి చేసి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలని సూచించారు.ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితం లోని వివిధ అనుభవాలను ప్రతిబింబిస్తాయని, ప్రతి సందర్భాన్ని వివేకంతో ఎదుర్కొనడం ద్వారా మంచి-చెడులను అర్థం చేసుకుని జీవితం పరిపూర్ణత సాధిస్తుందని నల్లమోతు భాస్కర్ రావు వివరించారు.ఈ నూతన సంవత్సరంలో సాగునీరు, తాగునీరు సమృద్ధిగా లభించి, పంటలు బాగా పండాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.