
జనం న్యూస్ 19 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గృహ వినియోగదారులకు అందించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా బుక్ చేసుకున్న వెంటనే అందేలా చూడాలి భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ ఎఫ్ ఐడబ్ల్యు మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి కే పద్మావతి.ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కార్యదర్శి ఎం ఇందిర అధ్యక్షతన పట్టణంలోజరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం పేదలు వాడుతున్న సిలిండర్ ధరని అమాంతం పెంచేసిందని.. ఒకేసారి 60 రూపాయలు పెంచడం వల్ల పేదలకు అది పెనుభారంగా మారిందని వాపోయారు. అంతేకాకుండా సిలిండర్ ధర పేరుతో మిగతా నిత్యవసరాలు అన్ని అమాంతం పెరిగిపోయాయి వంట నూనె ధరలు ఒకేసారి 50 రూపాయలు పెరిగాయి.
ఒకేసారి ధరలు పెరగడం వల్ల కమర్షియల్ సిలిండర్ అసలు అందకం పోవడం వల్ల ఈరోజు హోటల్స్ హాస్టల్స్ మూతపడుతున్నాయి అనేకమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలి. ఎక్కడో యుద్ధం జరుగుతుంది మనకెందుకులే మనం తటస్థంగా ఉన్నామని ప్రజలని నమ్మబల్కుతున్నారు కానీ ఈరోజు యుద్ధం పేరుతో అమాంతం పెరిగిన ఈ ధరలని తగ్గించరు.వాటిని అలాగే కొనసాగిస్తారు. ప్రజలు కట్టే పన్నులతో లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకుంటున్న ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పనలో మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు. ఉచితాలతో ఊదరగొడుతూ అభివృద్ధిని కుంటు పడేశారు. ప్రజలకు కావలసిన నిత్యావసరాలు ధరలు పెంచేసి ఇప్పుడు సిలిండర్ ధర కూడా అందకుండా చేశారు కాబట్టి వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎం.ఇందిర, కే చెన్నమ్మ, ఎం ,జ్యోతి, సత్యమ్మ, సాయమ్మ హెచ్. సరిత, దివ్య, చెన్నమ్మ, ఉమ రహమతి, భవాని, పద్మ, లక్ష్మీ,మాధవి తదితరులు పాల్గొన్నారు.