
డోంగ్లి మార్చి 19 జనం న్యూస్
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని మదన్ హిప్పర్ గా సర్పంచ్ బాచేవారు లక్ష్మణ్ స్పష్టం చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈద్ ముబారక్’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు హిప్పర్గా గ్రామంలో సర్పంచ్ బాచేవారు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు ఆయన స్వయంగా కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సర్పంచ్ పవిత్రమైన ఈ మాసాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలపడాలని సూచించారు.ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ చర్యలు ముస్లింల జీవనోపాధికి తోడ్పడుతున్నాయని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమాకాంత్ పటేల్ మాజీ ఎంపీటీసీ సుభాష్ యువ నాయకుడు హనుమంత్ పోశెట్టి వార్డు సభ్యులు సిహెచ్ మల్లేష్ డి మల్లికార్జున్ సాయిలు కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు