
జనం న్యూస్ 20 మార్చి వికారాబాద్ జిల్లా
పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు మరియు పంచాంగ శ్రవణం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. గట్టుపల్లి సర్పంచ్ పద్మరాజు ఈ కార్యక్రమంలో పాల్గోని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ అభివృద్ధి, ప్రజల క్షేమాన్ని, గ్రామ ప్రజలందరూ ఆయుఆరోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వేద పండితులు ఈ ఏడాది ఆదాయ-వ్యయాలు, రాజపూజ్య-అవమానాలు మరియు గ్రహ గతులను వివరించారు. అందరూ కలిసి ఉగాది పచ్చడిని స్వీకరించి, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు నర్సిములు, అంజయ్య, కృష్ణ ,యాదయ్య, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.