
జనం న్యూస్ 20 మార్చి వికారాబాద్ జిల్లా
రంజాన్ పర్వదినని పురష్కరిచ్చుకుని పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి లో ముస్లిం సోదరులు, సోదరిమనులకు పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు దుస్తులు(తోఫా) పంపిణి చేసి రంజాన్ పండగను ఆనందంగా జరుపుకోవాలని అక్కంక్షించారు. ఈ సందర్బంగా అబ్రహం, సామేల్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం సోదరభావం, ప్రేమ. పరస్పర సహకారానికి ప్రతీక అని అన్నారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సాదక్, కావలి మంజుల, కావలి అనంతమ్మ, మైనార్టీ సోదరులు అక్బర్,బురన్, గపూర్, మహిమూద్, వార్డ్ నెంబర్లు డి.రవి, కె.చంద్రశేఖర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బందయ్య, జీవన్, సురేష్, ప్రభుదాస్, బి.యాదయ్య మరియు ముస్లిం సోదరి సోదరీమణులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
