
జనం న్యూస్ 20 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.ఈ రోజు ఎల్కూర్ గ్రామంలో గుర్రం బావి రోడ్డు, ఉప్పరి గేరు, కలిగేరు లైన్ వాసులకు మిషన్ భగీరథ కొళాయిలు లేక నీటికోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు మిషన్ భగీరథ కొత్త కొళాయిల కోసం పనులను గ్రామ సర్పంచ్ వినోద్ కుమార్ గారు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఆ కాలనీ వాసులు ఇన్ని సంవత్సరాలనుండి నీటి కోసం పడ్డ కష్టాలు నేటితో తీరుతున్నాయి అని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.అలాగే గ్రామ సర్పంచ్ వినోద్ కుమార్ మాట్లాడాతూ వేసవి కాలం లో గ్రామంలో ఎవరు కూడా నీటి కోసం ఇబ్బందులు పడకూడదు అని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ పనులను మంజూరు చేయడం జరిగింది. అందుకు గ్రామ ప్రజలందరూ పనులను మంజూరు చేసి మా కష్టాలను తీర్చిన ముఖ్య మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో వార్డు మెంబెర్ సోమసుందర్, వెంకట్రాములు, మల్లేష్, బుచ్చన్న, రాముడు, మునెప్ప, మల్దకల్, రామాంజనేయులు, యువకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
