
జనంన్యూస్. 20.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి అత్యధికంగా ప్రాతినిధ్యం
నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
అవకాశం కల్పించిన పిసీసీ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో నూతన కార్యవర్గంలోకి నూతనంగా నియమితులైన సభ్యులను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. కాగా జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ.. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఇందులో ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి పార్టీ నాయకులకు ప్రాతినిధ్యం కల్పించడం పట్ల ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.నూతనంగా నియమితులైన కార్యవర్గం కష్టపడి పనిచేసి.. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మల్యే పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.దానికి నిదర్శమే ఈ ఫలితాలు అని పునరుద్ఘాటించారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంలో చోటు దక్కించుకున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నాయకుల వివరాలు ఇలా:డీసీసీ ఉపాధ్యక్షులుగా:కురపాటి గంగాధర్ (డిచ్ పల్లి మండలం అమృతాపూర్) తారాచంద్ నాయక్ (డిచ్ పల్లి మండలం రాంపూర్) ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ (ధర్పల్లి మండలం) డీసీసీ ప్రధాన కార్యదర్శులుగా:వెల్మ భాస్కర్ రెడ్డి (సిరికొండ మండలం గడ్కోల్ ) పొలసాని శ్రీనివాస్ (డిచ్ పల్లి మండలం కమలాపూర్) అప్పల రాజన్న (జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్) గొల్ల ఎర్రన్న (సిరికొండ మండలం రావుట్ల) పరిపెల్లి గంగారెడ్డి ( సిరికొండ మండలం) కేతావత్ జయలలిత (ధర్పల్లి మండలం డిబి తండా) బున్నె రవి (మోపాల్ మండలం కంజర్ ) పైస ఎల్లయ్య ( నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట్) స్పోక్స్ పర్సన్స్ గోర్కంటి లింగన్న (మోపాల్ మండలం సింగంపల్లి ) డిసిసి కార్యదర్శులుగా:.సుజాత మదం( డిచ్ పల్లి మండలం రాంపూర్) జహుర్ అహ్మద్ (డిచ్ పల్లి మండలం కొరట్ పల్లి ) మహమ్మద్ సాదుల్లా (డిచ్ పల్లి మండలం)జైడి చిన్నా రెడ్డి (జక్రాన్ పల్లి మండలం)కేతవత్ మోహన్ నాయక్ (మోపాల్ మండలం ఎల్లమ్మకుంట) కంటెగారి కిరణ్ రావ్ (మోపాల్ మండలం న్యాల్ కల్) గుట్టమీది గంగాధర్ ( నిజామాబాద్ గంగస్తాన్) తలారి సుధాకర్ (ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి ) పి. మహేందర్ ( ధర్పల్లి మండలం ధమన్నపేట్ ) మోత్కూరి నవీన్ గౌడ్ ( ఇందల్వాయి మండలం) సుగ్గెం కరుణాకర్ (ఇందల్వాయి మండలం లింగాపూర్) కర్డురాం సాయికుమార్ (మోపాల్ మండలం తానా ఖుర్)