
(జనం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్)
జనం న్యూస్, మార్చ్ 20, జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందిన ఘటన జరిగింది . వివరాల్లోకి వెళ్తే (టీజీ 16 టి 2585) గల ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుండి హన్మకొండ వైపు వెళ్తున్న బస్సు మెట్ పల్లి బస్టాండ్ లోపలికి వెళుతున్న సమయంలో ముందు టైరు వృద్ధుడి పైనుంచి వెళ్లడంతో కుడి చెయ్యి నుజ్జు నుజ్జు అయిన కొన ఊపిరితో ఉన్న వృద్ధుడు నీ మెట్టుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అప్పటికే డాక్టర్లు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు దాదాపు 66 సంవత్సరాలుగా ఉంటుందని తెలిపారు. అతని పేరు దుర్గయ్య గా మెట్ పల్లి పట్టణానికి చెందిన 6 వార్డు శాంతినగర్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.