

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి మరియు గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ముస్లిం కుటుంబాలకు మైనార్టీ నాయకులు షేక్ మౌలా మరియు పఠాన్ మెహర్ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లు మరియు చీరలను పంపిణీ చేశారు. రంజాన్ మాస పవిత్రతను చాటుతూ, పేద ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్య క్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ. నిరుపేదలకు అండగా నిలవడం మానవ త్వమని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డేవిడ్ కళ్యాణి రాజు, వార్డు మెంబర్ సిరిసిల్ల నాగేంద్ర గ్రామంలోని అర్హులైన నిరుపేదల సమాచారాన్ని సేకరించారు. ఆ వివరాల మేరకు మైనార్టీ నాయకులతో కలిసి నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి రంజాన్ తోఫా కానుకలను అందజేశారు.కార్యక్రమ విశేషాలు:
పంపిణీ చేసినవి:15 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన రంజాన్ తోఫా కిట్లు మరియు మహిళలకు చీరలు.
నిర్వాహకులు: షేక్ మౌలా, పఠాన్ మెహర్ ఖాన్. తమ ఇంటి వద్దకే వచ్చి కానుకలు అందజేయడం పట్ల స్థానిక ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.