
బాధితుడు కావలి శివకుమార్
జనం న్యూస్ 22 మార్చి వికారాబాద్ జిల్లా
నాపై అనవసరంగా ఇనుప రాడుతో దాడి చేసిన ఊర కుర్వ పరమేశ్ పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితుడు కావలి శివకుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల పరిధిలోని గంగాడ గ్రామానికి చెందిన కావలి శివకుమార్ మీడియాతో మాట్లాడారు. నేను స్వాతి 2025 జూన్ 24న ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపారు. స్వాతి వాళ్ళ అమ్మ నాన్న మాతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారని అన్నారు. మా భార్య స్వాతి బాబాయి అయినా ఊరకురువ పరమేష్ అనవసరంగా బుధవారం సుమారు సాయంత్రం 5గంటల సమయంలో మా భార్యను కొట్టారని తెలిపారు. మా భార్య స్వాతి నాకు సమాచారం ఇవ్వడంతో నేను ఊరకురువ పరమేశ్ ను మా భార్యను ఎందుకు కొట్టావని అడగగా ఆయన బుధవారం సాయంత్రం సుమారు 8 గంటల సమయంలో మాపై ఇనుపరాడుతో దాడి చేశారని తెలిపారు. నా తలకు తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు. నాపై దాడి చేసిన పరమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి దర్యాప్తు చేసి నాపై అనవసరంగా దాడి చేసిన పరమేష్ ని కఠినంగా శిక్షించాలని అన్నారు.