పసుపు ,కుంకుమ లతో గంగమ్మ తల్లికి జల హారతి ఇచ్చిన మంత్రి సవిత .
జనం న్యూస్ ఫిబ్రవరి 12 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గము రాయలసీమను రతనాల సీమగ మారుస్తాం,కరువు ప్రాంతాన్ని ససస్యామలం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం మని మంత్రి సవితమ్మ తెలిపారు.. ,శ్రీ సత్యసాయిజిల్లా పెనుకోండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ లో జల హరతి చేసారు ,రెండేళ్ళ తరువాత గొల్లపల్లి రిజర్వాయర్ నుండి నీటిని వదిలారు,అనంతరం మీడియాతో మంత్రి సవిత మాట్లాడూతు పెనుకొండకు గొల్లపల్లి రిజర్వాయర్ తెచ్చి,కియాను తీసుకువచ్చారని చంద్రబాబునాయుడు,గత వైసిపి పాలనలో అభివృధ్ధికి నోచుకోని ర్రాష్టాన్ని మళ్ళి కూటమి ప్రభుత్వం వచ్చాకే పూర్వ వైభవం వచ్చిందన్నారు,పోలవరం పూర్తి చేసి బెనకచర్ల డ్యాంను పూర్తి చేసి ప్రతి రైతుకు కృష్ణా జలాలు అందించి,ప్రతి రైతు పంటకు ప్రాణం పోస్తామన్నారు,సంపద సృష్టించాలి,,పరిశ్రమలు రాష్ర్టానికి తీసుకు రావాలీ,రాష్ర్టాన్ని అభివృధ్ధి బాటలో నడుపుతు,ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను మొదలు పెట్టి,కాలువల వైండింగ్ కోసం 3,650 కోట్లు విడుదల చేసిన ఘనత చంద్రబాబుదేదని మంత్రి సవితమ్మ తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు పెద్ద పీట వేస్తు న్నారని, రాయలసీమ రైతుల జీవనాడి హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకమని మంత్రి సవిత తెలిపార, శ్రీశైలంజలాశయం నుంచి కృష్ణా వరదనీటినిమళ్లించి,సాగు,తాగునీటినిఅందించడానికి ఈప్రాజెక్టును రూపొందించారు. రాష్ట్ర విభజన తరువాత అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.1,030 కోట్లతో హంద్రీ-నీవా తొలి దశ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిందని,ప్రాజెక్టులో 80% పనులు కూడా పూర్తయ్యాయి.వైసీపీ ప్రభుత్వం రాకతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.కేవలం 20 శాతం పనులు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేక పోయింది, రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులను జగన్పట్టించుకోలేదు.కనీసం ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్ కూడా పెట్టలేదు, మరోసారి సీఎం చంద్రబాబు అధికారంలోకి రావడంతో హంద్రీ నీవా పనులు ఊపందుకున్నాయని తెలిపారు.కరవు సీమలో పుష్కలంగా కృష్ణా జలాలు మళ్లించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెలుతోంద 1.90 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినగొల్లపల్లిరిజర్వాయర్ నుంచి పెనుకొండ, హిందూపురం మరియు మడకశిరనియోజకవర్గాలకు చెందిన 265 చెరువులు నింపుతున్నామని మంత్రి తెలిపారు.ఈ 265 చెరువుల ద్వారా 42,772 ఎకరాలకు నీరందిస్తాం..ఈ గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించడం ద్వారా పెనుకొండ, హిందూపురం మరియు మడకశిర నియోజకవర్గాల్లో తాగునీటి కష్టాలు తీరాయని మంత్రి తెలిపారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీయా సహా పలు పరిశ్రమలకు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీరందిస్తున్నాం,తద్వారా ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి పొందుతున్నారని తెలిపారు.రాష్ట్రంలో వైసీపీ పార్టీ శకం ముగిసిందని జగన్ లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత మైండ్ దొబ్బిందని,వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు, దాడులు అన్ని ఇన్ని కాదని144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళలో జగన్ మోహన్ రెడ్డి, నాయకులు , పోయి గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసిన, ఆ పార్టీ చేసిన అరాచకాలు కు మోక్షం మరో 144 సంవత్సరాలైనా మోక్షం లభించదని మంత్రి సవితమ్మ విమర్శించారు.ఈ కార్యక్రమంలో హంద్రీనీవా అధికారులు ,కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు…