
జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా. 23-03-26
భరతమాత స్వేచ్ఛా స్వాతంత్రాలకై తమ ప్రాణాలర్పించిన అమర వీరులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు ల అనుపమాన త్యాగాన్ని స్మరించుకుంటూ కడప జిల్లా,రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు."షహీద్ దివస్" సందర్భంగా వారికి ఘనంగా నివాళులు రాజంపేట జనసేన నాయ కులు యల్లటూరు శివరామ రాజు ,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండెం అబూబకర్,,పెడకాలసుధాకర్,ముబాషీర్, మౌలా, గాజుల కులయప్ప, సాయి రాజు తదితరులు.ఈ సందర్భంగా యల్లటూరు శివరామ రాజు మాట్లాడుతూ ఈ రోజు మనం భారత మాత యొక్క వీరపుత్రులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లకు గౌరవంగా నమస్కరిస్తు న్నాము. దేశం కోసం వారు చేసిన బలిదానం మన సమూహ జ్ఞాపకాలలో చిరస్థాయి గానిలిచిపోయింది.
చిన్న వయస్సులోనే వారు అసాధారణ ధైర్యాన్ని, భారత స్వాతంత్ర్య సాధన పట్ల అచంచల నిబద్ధతను ప్రదర్శిం చారు. వలస పాలన శక్తిని ఏమాత్రంభయపడకుండా, వారు త్యాగ మార్గాన్ని ధైర్యంగాఎంచుకుని, తమ ప్రాణాల కంటే దేశాన్ని ముందుంచారు. న్యాయం, దేశభక్తి, నిర్భయ పోరాటం వంటి వారి సిద్ధాంతాలు ఇప్పటికీ అనేక మంది భారతీయులలో ప్రేరణను నింపుతున్నాయి అని కొనియాడారు.