
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 22. 03. 2026
తెలంగాణలో యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మొదటి విడతగా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు నేడు (మార్చి 22వ తేదీ) రూ.3,590 కోట్లను పంపిణీ చేయనుంది. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అనంతరం ఏప్రిల్లో మరో 2 విడతలుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
