
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
జనం న్యూస్,మార్చ్ 23,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తడ్కల్ భారతీయ జనతా పార్టీ నాయకులను సోమవారం కంగ్టి పోలీస్ సిబ్బంది ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నాయకులను నిర్బంధించడం సరికాదని అన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను ఇలా ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. లాఠీలు,తూటాలు, అక్రమ కేసులు, అరెస్టులు వంటి దమనకాండ చర్యలతో బీజేపీ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని అన్నారు.ఈ ద్రోహానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ధర్మపోరాటం మరింత ఉధృతంగా కొనసాగిస్తామని అన్నారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అరెస్టులు చేసినా, ప్రజల హక్కుల కోసం పోరాటం ఆగదని, చివరి వరకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పోరాడుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రపు సత్యనారాయణ,దత్తు, రమేష్ గౌడ్,కమ్మరి నరేందర్,మొగులయ్య, పాల్గొన్నారు.